
సాదాబైనామాలకు మోక్షం
దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా అధికారుల చర్యలు హైకోర్టు తీర్పుతో అన్నదాతల్లో ఆనందం
సుల్తానాబాద్(పెద్దపల్లి): సాదాబైనామాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గతంలో కేవలం తె ల్లకాగితాలపై రాసుకుని రైతులు భూముల క్ర యవిక్రయాలు సాగించారు. ఇలాంటి వాటిని క్ర మబద్ధీకరించాలని ప్రభుత్వం భావించింది. గత ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తదుపరి కార్యాచరణలో పురోగతిలేక ద రఖాస్తుదారులు అనేక ఏళ్లు నిరీక్షించారు. చివరకు హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో సాదాబైమానాల క్రమబద్ధీకరణకు మోక్షం లభిస్తుందని అంటున్నారు.
జిల్లాలో 5,854 దరఖాస్తులు..
జిల్లావ్యాప్తంగా అధికారులకు 5,854 సాదా బైనామా దరఖాస్తులు అందాయి. జూలపల్లి మండలంలో అత్యధికంగా 1,138 దరఖాస్తులు రాగా, కమాన్‌పూర్ మండలంలో అతితక్కువగా 99 దరఖాస్తులు వచ్చాయి.
సాగు చేస్తున్నా.. హక్కుల్లేవు..
భూమి సాగుచేస్తున్న రైతులకు ఇప్పటిదాకా హ క్కులు లేవు. పెట్టుబడి సాయం కోసం అనర్హులే అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో అర్హులందరికీ భూములపై హక్కులు దక్కే అవకాశం ఉంది.
మిస్సింగ్ నంబర్లకూ దరఖాస్తులు
గ్రామాలు, పట్టణ శివారుల్లోని మిస్సింగ్ నంబర్లపైనా కొందరు దరఖాస్తు చేశారు. వాటితోపాటు విరాసత్, గిఫ్ట్‌డీడ్ అర్జీలూ ఉన్నాయి. పొరపాట్లు సరిచేయాలని, బంజరాయి, అసైన్డ్, నాలా తదితర సమస్యలపైనా అధికారులకు దరఖాస్తులు అందాయి. ఇలా ప్రభుత్వానికి 15,916 దరఖాస్తులు అందగా.. అందులో 5,854 సాదాబైనామాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.