విద్యార్థులను అభినందిస్తున్న యాజమాన్యం
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన పాలపు సత్తయ్య(60) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సత్తయ్య ఆదివారం సాయంత్రం నుస్తులాపూర్ శివారులో నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని తలకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించి, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి బంధువు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక
కరీంనగర్ స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో మంగళ, బుధవారాల్లో జరగనున్న 8వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల జూడో పోటీలకు కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థల విద్యార్థులు ఎంపికై నట్లు పీఈటీ మహేందర్ తెలిపారు. ఇటీవల ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో 14 మంది రాణించారన్నారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్ జి.సరితారెడ్డి వారిని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి, జాతీయస్థాయికి ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.


