
కాళేశ్వరం ఖాళీ కావడంతో ఎడారిగా గోదావరి
రామగుండం:కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంతో ఎగువన ఉన్న బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే, అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వలతో కళకళలాడుతోంది. మరోవైపు.. సుందిళ్ల బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో దిగువన గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. ఈ రెండింటి మధ్య కేవలం గేట్లు మాత్రమే అడ్డు ఉండడం గమనార్హం. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వంతెనపై నిల్చొని చూస్తే రెండువైపులా విభిన్న కోణాల్లో గోదావరి నది దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.175 టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి.

పూర్తిస్థాయి నీటిమట్టంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు