● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కేసలి అప్పారావు
విజయనగరం అర్బన్: విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు విద్యాసంస్థల్లో సైకాలజిస్ట్‌లను నియమించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కేసలి అప్పారావు ఓ ప్రకటనలో గురువారం డిమాండ్ చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి నుంచి జూనియర్ కళాశాల వరకు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సుశిక్షితులైన, అనుభవజ్ఞులైన మానసిక వైద్య నిపుణులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై రానురాను ఒత్తిడి పెరుగుతోందని, దీంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి సైకాలజిస్ట్‌లతో కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చన్నారు. విద్యార్థులు, యువత అంతా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు.


