● మూడో సెమిస్టర్ సిలబస్‌లో పక్కి రవీంద్రనాథ్ కవిత
పార్వతీపురం రూరల్: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన ‘హా...హతవిధీ’ కవితను డిగ్రీ పాఠ్యాంశంగా ఎంపిక చేశారు. డిగ్రీ మూడో సెమిస్టర్‌లోని ‘కవిత్వ నిర్మాణం’ పాఠంలో ఈ కవితను చేర్చుతున్నట్లు తెలుగు పాఠ్యపుస్తక మండలి సంపాదకులు సుంకర గోపాలయ్య తెలిపారు. ఈ మేరకు కవి అనుమతిని కోరుతూ ఆయనకు లేఖ పంపారు. గతంలోనూ రవీంద్రనాథ్ రాసిన ‘నొయిడా నిఠారి కాల్వలో...’ కవిత హిందీ అనువాదాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం అక్కడి డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. తాజాగా రవీంద్రనాథ్ కవిత డిగ్రీ సిలబస్‌కు ఎంపిక కావడంపై ‘స్నేహకళా సాహితి’ సభ్యులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.


