తీరు మార్చుకోండి.. | - | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోండి..

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

తీరు మార్చుకోండి..

సీహెచ్‌సీ వైద్యాధికారులకు సెంట్రల్‌ టీమ్‌ క్లాస్‌

నెల్లిమర్ల: రోగులకు సేవలందించడంలో వైద్యాధికారులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని నెల్లిమర్ల సీహెచ్‌సీ వైద్యాధికారులకు సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు హెచ్చరించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు లోపాలను గుర్తించారు. వైద్యులు అందిస్తున్న సేవలపై రోగులను ఆరా తీశారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ టీమ్‌ వైద్యాధికారులకు క్లాస్‌ తీసుకున్నారు. వైద్యులు విధులకు గైర్హాజరు అయినప్పుడు తమ స్థానాల్లో ప్రైవేటు వైద్యులను పురమాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ప్రైవేటు వైద్యులను ఎలా రప్పిస్తారని ప్రశ్నించారు. మరీ అత్యవసరం అయితే తప్ప కేసులను రిఫర్‌ చేయవద్దని సూచించారు. రోగులకు సేవలందించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సెంట్రల్‌ టీమ్‌ హెచ్చరించింది. అనంతరం డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీ రాణికి పలు సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement