కొత్త సంస్కరణలతోనే.. | - | Sakshi
Sakshi News home page

కొత్త సంస్కరణలతోనే..

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

ప్రభుత్వం విద్యా రంగంలో కొత్త కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి గందరగోళంలో పెడుతుంది. సమాంతర మీడియంలు రద్దు చేయడం, టీచర్లను కుదించడం, ఆన్‌లైన్‌ వర్కులు పెంచడం, బోధనేతర పనులు అప్పజెప్పి బోధనా కాలాన్ని హరించడం, నూతన జాతీయ విద్యావిధానం అమలు చేయడం, తాజాగా వలసలు వెళ్లే కుటుంబాల సంఖ్య పెరగడం, ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించే విధంగా ప్రభుత్వమే ప్రత్యక్షంగా ,పరోక్షంగా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ లోపాలు ఉన్నాయి.

– కె విజయగౌరి,

యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాద్యక్షురాలు

ప్రవేశాల పెంపునకు కృషి

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపునకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నాం. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం.

– యు.మాణిక్యంనాయుడు,

డీఈఓ, విజయనగరం

Advertisement
 
Advertisement
Advertisement