రేగిడి: మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కేశరాపు సత్తిరాజు (40) బుధవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన గత మూడు సంవత్సరాలుగా మండలంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పని ఒత్తిడితో పాటు జీతాలు అందడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా ఉందని ఎప్పుడూ తమతో చెప్పేవాడని స్నేహితులు పేర్కొన్నారు. ఇతనికి భార్య సంతోషి, ఎనిమిదేళ్ల చిన్నారి పల్లవి ఉన్నారు. సత్తిరాజు స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం నమర గ్రామం. ఈయన ఉద్యోగ రీత్యా మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన మరణవార్త తెలుసుకుని ఎంపీడీఓ శ్యామలాకుమారి, తహసీల్దార్ ఈశ్వరరావు, ఏపీఓ హరనాథ్, టీఏలు, ఎఫ్‌ఏలు కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలిపారు.


