● వైఎస్సార్‌సీపీ నాయకురాలు బొత్స అనూష
చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఓటరు జాబితా సక్రమంగా ఉండడం అత్యంత కీలకమని వైఎస్సార్‌సీపీ యువ నాయకురాలు బొత్స అనూష అన్నారు. గరివిడి మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చీపురుపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులు, క్లస్టర్, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవిల్ ఏజెంట్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా చేర్పించాలన్నారు. గ్రామాల నుంచి శాశ్వతంగా వలసవెళ్లిన వారు, మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియలో అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తేనే పార్టీకి బలం పెరుగుతుందన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు క్లస్టర్, డివిజన్ వ్యవస్థలు ఉపయోగపడతాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత బూత్ ఏజెంట్లపై ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చీపురుపల్లి మండల అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచారవిభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, దన్నాన జనార్ధన్, పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసులనాయుడు, మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.


