సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం.. | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం..

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌

విజయనగరం టౌన్‌: సమస్యలు పరిష్కరించేంతవరకూ పోరాటం చేస్తామని ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. భాస్కరరావు స్పష్టం చేశారు. ఏఐబీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు బుధవారం స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. 2026 ఫిబ్రవరి 27 నాటికి డీపీఈ కార్యాలయం ఇచ్చిన ఆర్డర్‌లో పేరా 5ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

డియర్‌నెస్‌ రిలీఫ్‌ వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్‌లో ప్రతి మూడు నెలలకు డీఏ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు టీఎస్‌.ప్రకాశరావు, అసిస్టెంట్‌ సర్కిల్‌ సెక్రటరీ డి.సుబ్బారావు, కన్వీనర్‌ ఆలుగు వెంకటరావు, జి. అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement