రీ సర్వేలో మన్యం జిల్లా ముందంజ | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేలో మన్యం జిల్లా ముందంజ

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

పార్వతీపురం: భూముల రీ–సర్వే ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని, భూ రికార్డుల ముద్రణలో జిల్లా 94.71 శాతం పురోగతి సాధించిందని సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి మంగళవాం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రభాకరరెడ్డి, జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ ఐటీడీఏ పీఓలు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌లు పాల్గొన్నారు. పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా పాస్‌పుస్తకాలు అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

అవగాహనతో పనిచేయాలి

రెవెన్యూ అధికారులు మండల, జిల్లాస్థాయి సమస్యలను సమగ్ర అవగాహనతో పరిష్కరించాలని కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో ఈకేవీసీ, డీఎల్‌ఆర్‌, ఎల్‌సీసీ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. భూముల రీసర్వే కేసుల పరిష్కారం, ఈకేవీసీ ప్రక్రియ, డీఎల్‌ఆర్‌ మ్యూటేషన్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫేజ్‌–5 రీసర్వేలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 56 గ్రామాల ఈకేవైసీ పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా భాగస్వామ్యంతో భూ రికార్డుల సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌ఓ కె.హేమలత, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement