భూసేకరణ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ వేగవంతం చేయండి

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

భూసేకరణ వేగవంతం చేయండి

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో వివిధ ప్రాజెక్టు నిర్మాణాలకు చేపట్టిన భూసేకరణ పక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతుమాధవన్‌ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన వర్చువల్‌గా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రైబల్‌ యూనివర్సిటీకి విద్యుత్‌ స్థాపనలో భాగంగా హెచ్‌టీ లైన్లు వేయడానికి అనుమతులు మంజూరు చేయాలన్నా రు. భూసేకరణ అనంతరం అనుమతులు వచ్చిన వెంటనే బిల్స్‌ అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. తారకరామతీర్థసాగర్‌, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మూడో రైల్వే లైన్‌, కొత్తవలస, విజయనగరం నాలుగో రైల్వేలైన్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట బడ్జెట్‌ అంచనా వేయాలన్నారు. వివిధ దశలలో గల భూసేకరణ పక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో పెండింగ్‌ మ్యుటేషన్లను వెంటనే పరిష్కరించాలన్నారు. తిరస్కరణకు గల కారణాలను తెలియజేస్తూ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ సత్తిబాబు, ఆర్డీఓ సుధాసాగర్‌, రామ్మోహన్‌, సుధారాణి పాల్గొన్నారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌

Advertisement
 
Advertisement
Advertisement