పథకాలపై ప్రచారం | - | Sakshi
Sakshi News home page

పథకాలపై ప్రచారం

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

పథకాలపై ప్రచారం

పార్వతీపురం: గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న జన్‌ భాగీదారి–జన జాగృతి కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ప్రచార వాహనానికి సోమ వారం పచ్చజెండా ఊపారు. ఈనెల 19 నుంచి 25 వరకు జిల్లాలోని 14 మండలాల పరిధిలో 333 గ్రామాల్లో ప్రచార కార్యక్రమం కొనసాగుతుందన్నా రు. సుమారు 1.90 లక్షల మంది గిరిజనులకు ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, జీవనోపాధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ, ఐటీడీఏ పీఓలు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement