పార్వతీపురం రూరల్: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్ ప్రభాకరరెడ్డి సోమవారం తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్‌పై ప్రయాణించా రు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి సైకిల్‌పై చేరుకున్నారు. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయాణం సాగింది. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలని, వాహనాల వినియోగం తగ్గించాలని కోరారు.
పాలకొండ రూరల్: రిమాండ్ ఖైదీల ఆరోగ్య భద్రతపై జైలు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయాధికార సేవా సమితి కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పాలకొండ సబ్‌జైలును ఆకస్మికంగా సందర్శించి రిమాండ్ ఖైదీలతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న ఆహా రం, సేవలపై ఆరాతీశారు. న్యాయ సేవల కోసం అందించనున్న ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. వారి ఆరోగ్య స్థితిగతులపై దృష్టిసారించాలని సిబ్బంది కచ్చితంగా నిబంధనల ను అమలు చేయాలని స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ పి.జోగులు, జైలు సిబ్బంది రమణ య్య, విజయ్‌కుమార్, శ్రీనివాసరావు, నాగరా జు, నాయుడు తదిరులు ఉన్నారు.
పార్వతీపురం రూరల్: స్థానిక ఉపాధ్యాయుడు, రచయిత సిరికి స్వామినాయుడు రచించిన ‘పొద్దు’ కవితను డిగ్రీ మూడో సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశంగా చేర్చాలని గుంటూరులోని డిగ్రీ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది. ఈ మేరకు పాఠ్యాంశంలో పొందుపరిచేందుకు రచయిత అనుమతి కోరగా.. ఆయన తన అంగీకారాన్ని తెలిపారు.
కవితలోని భాష, శిల్పం డిగ్రీ విద్యార్థుల పాఠ్యప్రణాళికకు అనుకూలంగా ఉండడంతో పాటు, వారిలో కవిత్వంపై అభిరుచిని పెంపొందించేందుకు దోహదపడు తుందని పాఠ్యపుస్తక సంపాదకుడు డాక్టర్ సుంకర గోపాలయ్య తెలిపారు. తన కవిత ఎంపిక కావడంపై స్వామినాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్నేహకళాసాహితి సంస్థ ప్రతినిధులు, స్థానిక కవులు, ఉపాధ్యాయులు, మన్యం జిల్లా శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలిపారు.


