మండలంలోని పెదపెంకి గ్రామాన్ని వారం రోజుల నుంచి తాగునీటి సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని దీనివల్ల తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు ఆవేదన చెందారు. అందులో భాగంగా ఎస్సీ కాలనీలో మహిళలు బిందెలు పట్టుకుని సోమవారం నిరసన తెలిపా రు. గ్రామంలో రక్షితమంచినీటి పథకం కొళాయినీరు, ఇతరత్రా తాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో గుక్కెడు తాగునీరు అందక అవస్థలు పడుతున్నామని వాపోయారు. గ్రామంలో అభివృద్ధి పనుల నిర్వహణ నిమిత్తం అధికార యంత్రాంగం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోనే ఉంటున్నారని అయినప్పటికీ స్పందించడం లేదని అసహనం వెళ్లగక్కారు. గుక్కెడు తాగునీరు అందించలేని అభివృద్ధి ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సరఫరా అందించాలని కోరుతున్నారు. కార్యక్రమలో జి.శ్రీనివాసరావు, సంజీవనాయుడు, మహిళలు పాల్గొన్నారు. –బలిజిపేట


