● గ్యాస్‌ కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

● గ్యాస్‌ కోసం ఆందోళన

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

పార్వతీపురం: ఆరు నెలలుగా భారత్‌ గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన పలువురు మహిళలు కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం ఆందోళన చేశారు. సమస్యను పరి ష్కరించాలంటూ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. ఉచిత గ్యాస్‌ సరఫరాను చంద్ర బాబు ప్రభుత్వం ఎప్పుడో పక్కనపెట్టేసిందని, కనీసం డబ్బులుకై నా గ్యాస్‌ సరఫరా చేయాలని కోరారు.

కార్యక్రమంలో ఆర్‌.దాలమ్మ, ఎ.గంగమ్మ, ఎస్‌.వరలక్ష్మి, సీహెచ్‌ చిన్నమ్మి, కర్రి గౌరమ్మ, గెంబలి గౌరమ్మ, ఎ.కృష్ణవేణి, కె.వరలక్ష్మి, కె.రవణమ్మ, బి.సూరీడమ్మ, బి.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement