వైఎస్సార్‌సీపీలో చేరిన పాలవలస గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన పాలవలస గ్రామస్తులు

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

బొబ్బిలి: పట్టణంలో సోమవారం జరిగిన పెట్రో ధరల పెంపు నిరసన ర్యాలీకి ముందు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రామభద్రపురం మండలం పాలవలస గ్రామానికి చెందిన పొట్నూరు దుర్గారావు, మరో ముగ్గురు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైఎస్సార్‌సీపీ బొబ్బిలి నియోజక వర్గ ఇన్‌చార్జి శంబంగి వెంకట చినఅప్పలనాయుడు పార్టీ కండువాలువేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి నియంతృత్వ పోకడలు, ప్రజావ్యతిరేక విధానాలకు విసుగెత్తి వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా శంబంగి అన్నారు. రామభద్రపురం ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నడిమింటి సత్యం, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ డబ్ల్యూవీఎల్‌ఎన్‌ రాయలు, యువజన విభాగం అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్‌నాథ్‌, ఉపాధ్యక్షుడు థాట్రాజ్‌ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement