వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన బలగ లక్ష్మునాయుడు అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్‌శంకర్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 4న రాజమండ్రి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదన్నారు. భార్య బలగ పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీ

90 మందిపై కేసుల నమోదు

విజయనగరం క్రైమ్‌: గడిచిన ఆరు నెలల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 200 మందిని జైలుకు పంపించినట్లు ఎస్పీ దామోదర్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు చెప్పారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న విజిబుల్‌ పోలీసింగుతోపాటు రహదారి ప్రమాదాల నియంత్రణకు ’డ్రంకెన్‌ డ్రైవ్‌’ ప్రత్యేక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్లాక్‌ స్పాట్స్‌, ముఖ్య కూడళ్ల వద్ద సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడిపిన 90 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారని, వాహన తనిఖీల్లో ఎంవీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 200 ఈచలానాలను విధించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలను నడిపిన వారిపై 1668 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్‌ అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారన్నారు. మద్యం తాగి రోడ్డు ప్రమాదాలకు కారకులు కావద్దని, మీపై ఆధారపడి జీవించే భార్య, పిల్లల గురించి ఆలోచించాలని ఎస్పీ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement