పిడుగంటే అత్యధిక విద్యుత్‌ ప్రవాహకం | - | Sakshi
Sakshi News home page

పిడుగంటే అత్యధిక విద్యుత్‌ ప్రవాహకం

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

పిడుగంటే అత్యధిక విద్యుత్‌ ప్రవాహకం

మెరుపుతో ఏర్పడే అత్యధిక విద్యుత్‌ ప్రవాహకమే పిడుగు. ఒక్కోసారి విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్‌ భూమి వైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్లు విద్యుత్‌ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్‌ క్షేత్ర తీవ్రత మీటరుకు 2లక్షల ఓల్టులతో సమానం. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్టతీవ్రత ఉంటుంది. పిడుగులు ఎక్కువగా క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఏర్పడతాయి. మేఘాల్లో మంచు, నీరు ఏర్పడినప్పుడు స్ట్రాటోస్పియర్‌లో చల్లని వాతావరణంలో విరుద్ధవిద్యుదావేశాలు ఏర్పడి స్ధిర విద్యుత్‌ ప్రవాహంగా మారతాయి. ఆ సమయంలో పిడుగులు ఏర్పడతాయి.

– పొట్నూరు రాజీవ్‌, ఇస్త్రో శాస్త్రవేత్త, విక్రమపురం, వీరఘట్టం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement