పార్వతీపురం: జిల్లాలోని బ్యాంకుల్లో స్తంభించిన ప్రభుత్వ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంక్ మేనేజర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగంలో లేని ఖాతాలను గుర్తించి పునరుద్ధరించడంతో ప్రభుత్వ నిధుల వినియోగం వేగవంతం అవు తుందన్నారు. డీఆర్వో కె.హేమలత మాట్లాడు తూ ఖాతాల పునరుద్ధరణలో ఎదురయ్యే సమస్యలకు తగిన మార్గదర్శకాలు అందించి సహ కారం అందిస్తామన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ ప్రతినిధులు, సబ్‌ట్రెజరీ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం: మావిగన్ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్‌లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూ తు రాతలు, రోత వాఖ్యలపై అంబేడ్కర్ రైట్స్ ఫోరం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం కూడలిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫో రం ప్రతినిధులు బుంగ భానుమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కుటుంబాలకు చెందిన మహిళలపై రాధాకృష్ణ రాతలు, వాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆ పత్రిక, చానల్ యజమాని తీరును ఖండిస్తున్నామమన్నారు. సంస్థపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకో ర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ, వారిని భయపెట్టే పదాలను వినియోగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోర మ్ ప్రతినిధులు దారాన వెంకటేష్, లోపింటి రామకృష్ణ, నిమ్మకాయల సుగుణాకర్, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి చింతపల్లి దుర్గారా వు, బుక అంజిబాబు పాల్గొన్నారు.
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణం జొన్నగుడ్డిలో పనిచేస్తున్న ఆర్పీ జయలక్ష్మి పనిఒత్తిడి వల్లే గుండెపోటుతో మృతి చెందిందిందని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ ఆర్పీల యూనియన్, సీఐటీయు ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. మృతురాలి ఫొటోలను చేతబట్టి న్యాయం చేయాలంటూ నినదించారు. అనంతరం పని ఒత్తిడి తగ్గించాలంటూ మెప్మా పీడీ చిట్టిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పీల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ ఝూన్సీ, సీఐటీయూ నాయకులు పి.మణి, జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి మాట్లాడుతూ... జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఆర్పీలపై అధిక పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త యాప్‌లను తీసుకువచ్చి రెండు రోజుల్లో లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తేవడం వల్లే జయలక్ష్మి గుండెపోటుకు గురైందని ఆరోపించారు. సరైన శిక్షణ లేకుండా ఇంజినీర్లు చేయాల్సిన పనులను ఆర్పీలకు అప్పగించడం అన్యాయమన్నారు. జయలక్ష్మి మృతి సహజం కాదని, ప్రభుత్వ విధానాల వల్లే జరిగిందని ఆరోపించారు. మరో ఆర్పీ రూప కూడా పని ఒత్తిడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఆర్పీలపై పెరుగుతున్న ఒత్తిడిని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని కోరారు.
జీతాలు చెల్లించకుండా బతికేదెలా?
నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని ఆర్పీల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలతో జీతాలు అందకపోతే జీవనం ఎలా సాగించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలు జయలక్ష్మి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, ఆర్పీలపై యాప్‌ల భారం తగ్గించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, ఎస్‌హెచ్‌జీ మీటింగ్ లొకేషన్ యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఎం.లత, కార్యదర్మి జి.రేణుక, ఉపాధ్యక్షురాలు బి.అప్పలనరసమ్మ, స్వాతి, డి.రమ, తదితరులు పాల్గొన్నారు.


