న్యూస్‌రీల్
విశాఖ–విజయనగరం–పార్వతీపురం మార్గంపై రైల్వేశాఖ నిర్లక్ష్యం అత్యంత రద్దీగా ఉన్న రూట్లో నడిచే బళ్లు స్వల్పం పాసింజర్ రైళ్లు అరకొర.. ఆపై సమయానికి రానిపరిస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు
సాలూరుకు రైలు బండి వచ్చేదెప్పుడు?
–8లో
గంజాయి కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకువస్తున్న నలుగురు యువకులను, ఓ జువై నల్(మైనర్ బాలుడు)ను తెర్లాం పోలీసులు అరెస్టు చేశారు.
వేసవి ఎండల తీవ్రత పెరిగింది. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓఆర్‌ఎస్ కార్నర్స్ లేక కొందరు ఇబ్బంది పడుతున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం మన్యం జిల్లాకు రైలు ప్రయా ణం ఇప్పటికీ అందీ అందనట్లే ఉంది. విశాఖ–విజయనగరం–బొబ్బిలి– ఒడిశా(రాయగడ) వైపు ప్రధాన మార్గమైనప్పటికీ.. రైల్వే శాఖ ఎందుకనో ఇటు చిన్నచూపు చూస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో నడిచే రైళ్లు రోజులో 10 కంటే తక్కువగానే ఉంటాయి. సరిపడా సర్వీసులు ఉండవు.. అవీ సమయానికి రావు. రద్దీకి తగ్గ బోగీ లూ వేయరు. దీంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగు లు, విద్యార్థులు, వ్యాపారులు అవస్థలు పడి, కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది.
వేలాది మందికి రైలు మార్గమే ఆధారం..
జిల్లా విభజన తర్వాత విజయనగరం, విశాఖప ట్నం ప్రాంతాల నుంచి బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు వైపు ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. తప్పనిసరి బదిలీలు కావడం వల్ల పిల్లల చదువు, ఇతర ఇబ్బందులతో కుటుంబాలను వదిలి ఇక్కడకు రాలేక.. మరో మార్గం దొరకక వందలాది మంది నిత్యం రాకపోకలు సాగి స్తున్నారు. బస్సుల్లో ప్రయాణం అధిక సమయం కావడంతో పాటు.. చార్జీల భారం కూడా మోయలేనంతగా పడుతుంది. దీనివల్ల రైలు ప్రయాణమే శరణ్యం అవుతోంది. విశాఖ నుంచి ఉదయం 4 గంటలకే విశాఖపట్నం–రాయపూర్ పాసింజర్ బయలుదేరుతుంది. ఇది ఎవరికీ అనుకూల సమయం కాదు. దీంతో ఉదయం 6.30 గంటల సమయంలో బయలుదేరే విశాఖపట్నం–కోరాపుట్ డీఎంయూ రైలునే ఆధారమవుతోంది. ఈ మార్గంలో విశాఖపట్నం–కొత్తవలస–విజయనగరం–బొబ్బిలి– పార్వతీపురం–రాయగడ వెళ్లే ప్రయాణికులు నిత్యం వేలాదిగా ఉంటారు. విద్య, ఉపాధి, వ్యాపార వర్గా లకు ఇదే ఆధారం. దీంతో పాటు రాయగడ అమ్మ వారి దర్శనానికి వెళ్లే వారు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఉంటారు. అంతటి కీలకమైన మార్గంలో.. అత్యంత ప్రాధాన్యం గల డీఎంయూను ఏనాడూ సమయానికి నడిపిన సందర్భాలు లేవు. పాసింజర్ రైలు కావడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ సర్వీసులకు మార్గం ఇచ్చేయాల్సి వస్తోంది. హౌరా వైపు వెళ్లే అన్ని సర్వీసుల కోసం దీనిని పక్కన పెట్టేస్తున్నారని.. దీనికితోడు, ఒక గూడ్స్ రైలు వెళ్లాలన్నా ఈ బండినే నిలుపు చేస్తున్నారని ఉద్యోగులు, విద్యార్థులు వాపోతున్నారు. ఫలితంగా వచ్చే సమయం.. వెళ్లే సమయం కచ్చితంగా ఉండడం లేదు. గంటల తరబడి ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. దీనివల్ల ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తినాల్సి వస్తోందని వారంతా వాపోతున్నారు. మొత్తంగా ఈ మార్గంలో మూ డే పాసింజర్ రైళ్లు నడవడం గమనార్హం. నిత్యం నడిచే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు రెండు, మూడే ఉన్నా యి. వీక్లీ బళ్లు ఉన్నా.. దూర ప్రాంతం నుంచి రావ డం వల్ల ఒక్క రోజు కూడా సమయానికి నడిచిన సందర్భాలు ఉండవు. దీనికితోడు సరిపడా బోగీలు వేయకపోవడం వల్ల కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
జిల్లా పరిధిలోని పార్వతీపురం, పార్వతీపురం టౌన్‌లను రెండు జంట స్టేషన్లుగా పిలుస్తుంటారు. ఆదా యం బాగున్నా సదుపాయాలు లేక ప్రయాణికుల కు అవస్థలు తప్పడం లేదు. జిల్లా పరిధిలో రూ. 460 కోట్ల వ్యయంతో 44 కిలోమీటర్ల మేర రైల్వే ఆధునికీకరణ పనులు చేపట్టారు. నిత్యం పనులు జరుగుతుండడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. స్టేషన్లలోనూ సదుపాయా లు ఉండడం లేదు. పార్వతీపురం టౌన్‌స్టేషన్ పరిధి లో రోజూ 1,200 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. పార్వతీపురం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కురుపాం, వీరఘట్టం మండలాల ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఆశ్రయిస్తుంటా రు. ఇక్కడ తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లు పనిచేయవు. రిజర్వేషన్ కోచ్‌ల డిస్‌ప్లే పని చేయ దు. తమ బోగీ కోసం ప్రయాణికులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
●నిత్యం వెయ్యి నుంచి 1,500 మంది ప్రయాణించే పార్వతీపురం(బెలగాం) స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు 365 రోజులూ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నడక వంతెన చిన్నది కావడంతో రాకపోకలకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 2, 3 నంబర్ ప్లాట్ ఫారం మెట్లు మరీ చిన్నవి కావడంతో అటుగా వెళ్లలేక, చాలా మంది ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు కూడా పట్టాలు దాటి ప్లాట్‌ఫాం పైకి రావాల్సిన దుస్థితి. ఈ స్టేషన్ల నుంచి నిత్యం సుమారు రూ.2 లక్షల వరకూ ఆదాయం వస్తున్నా ఆ స్థాయిలో సదుపాయాలు ఉండడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
●సీతానగరం, మక్కువ, బలిజిపేట మండలాల్లో ని పలు గ్రామాల ప్రయాణికులకు సీతానగరం రైల్వేస్టేషనే ఆధారం. ఇక్కడ ప్లాట్‌ఫాంపై షెడ్లు కూడా పూర్తి స్థాయిలో లేవు. నర్సిపురంలోనూ ఇదే పరిస్థితి.
●దీంతో ప్రయాణికులు ఎండావానకు ఇబ్బంది పడుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా సాలూరుకు రైలు బండి.. అదిగో, ఇదిగో అని ఊరిస్తూనే ఉంది. పలుమార్లు ట్రయ ల్ రన్ కూడా నిర్వహించారు. మంత్రి సంధ్యారా ణి అట్టహాసంగా ట్రయల్ రన్ ప్రక్రియను జెండా ఊపి కూడా ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ బండి కూత ఈ ప్రాంత వాసులకు వినిపించడం లేదు. విశాఖ–విజయనగరం ప్యాసింజ ర్ రైలు(మెము)ను సాలూరు వరకు పొడిగిస్తున్న ట్లు పలుమార్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎవరికీ అనుకూలం కాని సమయం ప్రకటించడంతో స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ బండి మాత్రం పట్టాలెక్కలేదు. సాలూరు విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో సాలూరు–బొబ్బిలి మధ్య నడుస్తున్న రైలు బస్సును రైల్వే శాఖ ఆపేసింది. తరువాత కరోనా తగ్గినా ఈ రైలు బస్సును మాత్రం నడపడం లేదు. రైలు బస్సు లేక, విశాఖ–విజయనగరం ప్యాసింజర్ రైలు రాక సాలూరు వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
●సాలూరు రైల్వే స్టేషన్‌ను రెండోప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పాలకులు నిర్మించారు. ఒడిశాకు సరుకు రవాణాకు ప్రధానంగా ఈ స్టేషన్‌ను వినియోగించారు. సాలూరు–బొబ్బి లి మధ్య తొలుత బొగ్గు తో నడిచే రైలు, తదుపరి డీజిల్ ఇంజిన్‌తో నడిచేది. నష్టాలు వస్తున్నాయని 1998లో ఈ స్టేషన్ ను ఎత్తివేశారు. ప్రయాణికుల దృష్ట్యా రైలు బస్సు ను నడిపారు. ఇది బొబ్బిలి–సాలూరు మధ్య ఐదు ట్రిప్పులు నడిచేది. దండిగాం రోడ్డులో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ రైలు బస్సు సైతం కరోనా కాలం నుంచి నడవడం లేదు. సాలూరుకు రైలు నడపాలని కొన్నేళ్లుగా రైల్వే ఉన్నతాధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నారు.
ఉద్యోగ నిర్వహణ కోసం విజయనగరం నుంచి పార్వతీపురానికి రోజూ వెళ్లాల్సి వస్తోంది. ఉదయం నడిచే డీఎంయూ రైలు మాకు ఆధారం. అది ఏ రోజూ సమయానికి రాదు.. వెళ్లదు. దీనివల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం సమయంలోనూ నిత్యం నడిచే పాసింజర్ రైళ్లు లేవు. ఈ మార్గం పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రయాణికుల పరిస్థితిని అర్థం చేసుకుని వేళకు నడపడంతో పాటు.. ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగ పడేలా అదనపు సర్వీసులను నడపాలి.
– శ్రీనివాస్, ప్రభుత్వ ఉద్యోగి, పార్వతీపురం
నిత్యం వ్యాపారం నిమిత్తం ఈ మార్గంలో బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం వైపు ప్రయాణిస్తాం. బస్సులకు వెళ్లలేని పరిస్థితి. రైలు ప్రయాణం కష్టంగా మారుతోంది. సమయానికి నడవవు. పాసింజర్ సర్వీసులు కూడా చాలా తక్కువ. ఎవరికీ ఉపయోగం లేని సమయంలో కొన్ని బళ్లు వెళ్లిపోతున్నాయి. ఉన్నవే తక్కువ.. అందులోనూ నిర్లక్ష్యం. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– రమణ, మార్కెటింగ్ ఉద్యోగి, విజయనగరం


