ఏబీఎన్‌ రాధాకృష్ణవి దిగజారుడు వ్యాఖ్యలు | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణవి దిగజారుడు వ్యాఖ్యలు

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

ఏబీఎన్‌ రాధాకృష్ణవి దిగజారుడు వ్యాఖ్యలు ● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ● మహిళలను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ● మహిళలను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

పార్వతీపురం రూరల్‌: మహిళల వ్యక్తిత్వాన్ని, వారి సామాజిక హోదాను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి టీవీ చానల్‌ అధినేత వేమూరి రాధాకృష్ణపై పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐను బుధవారం కలిసి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన ‘వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కే’ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేశార ని ఫిర్యాదులో పేర్కొన్నారు. జర్నలిజం విలువలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కార్యక్రమం సాగిందని, పార్టీ కార్యకర్తలను ‘వెన్నెముక లేని వారు’ అని సంబోధించడంతో పాటు, కుటుంబ సంబంధాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజికంగా అంగీకరించలేనివన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, దురుద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్న ఏబీఎన్‌ యాజమాన్యంపై, సంబంధిత ఎడిటర్‌, మేనేజ్‌మెంట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. తక్షణమే వేమూరి రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు, వైస్‌ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్‌, రాష్ట్ర అనుబంధ విభాగాల మహిళా సభ్యులు గండి భాగ్యవతి,గండిలక్ష్మి, ప్రభావతి, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివా సరావు, సీనియర్‌ నాయకులు వై.ప్రతాప్‌, పాత గౌరీశంకరరావు, గొర్లి మాధవరావు, కాగాన ప్రకా ష్‌, గురురాజు, శేఖర్‌, కోల సుధాకరరావు, బి.వాసుదేవరావు, గండి శంకరరావు, శ్రీనివాసరావు, వై.త్రినాథ, తేళ్ల శివున్నాయుడు, బడే నిరంజన్‌, రాజు, వి.నేతాజీ, జితేంద్ర, రాజేష్‌, ప్రభావతి, లక్ష్మి, రమ, ఆనంద్‌, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement