పల్లె ప్రగతికి శుభ్రత నాంది | - | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతికి శుభ్రత నాంది

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

పల్లె ప్రగతికి శుభ్రత నాంది

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని గ్రామాల రూపురేఖలను మార్చాలన్న లక్ష్యంతో ‘శుభ్రత’ అనే వినూ త్న ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్‌ సమీపంలోని సామాజిక భవనంలో మండల, గ్రామ స్థాయి అధికారులతో బుధవారం నిర్వహించిన అవగాహ న సదస్సులో ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామా ల్లో ఎక్కడా చెత్త, మురుగునీరు కనిపించకుండా ఐదు, ఆరు గ్రామాలను ఒక క్లస్టర్‌గా విభజించి వా రం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ సోక్‌పిట్‌ల నిర్మాణం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సీసీ రోడ్ల నిర్వహణపై మాట్లాడుతూ 30 ఏళ్ల కాలపరిమితి లోపు రోడ్లు పాడైతే సంబంధిత కాంట్రాక్టర్లతోనే ప్యాచ్‌ వర్కులు చేయించాలని, లేనిపక్షంలో వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా బోర్లు, రీచార్జ్‌ పిట్లను సిద్ధం చేయాలని, ‘జలధార–జలహారతి’ కింద చెరువులను పునరుద్ధరించి ఆక్రమణల నుంచి కాపాడాలని ఆదేశించారు. ప్రజల సమస్య లు గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యేలా ప్రతి గురువారం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ డే నిర్వహించాలని, ఏ ఒక్క సమస్యా జిల్లా కేంద్రం వరకు రాకూడద ని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా వీడియో కాల్‌లో బాధితులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, డీపీఓ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాలను బలోపేతం చేయాలి

పార్వతీపురం: జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మెప్మా ఆర్‌పీలు, జీఓలతో బుధవారం నిర్వహించి న సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాల సభ్యుల సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. సభ్యులకు రుణాల మంజూరు, చెల్లింపుల వివరాలను క్రమబద్ధీకరించాలని, ఈ ఏడాది వృద్ధికోసం ప్రత్యేక మైక్రోప్లాన్‌ను రూపొందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచి వ్యాధుల నివారణకు మహి ళా సంఘాలు మందుండాలని పిలుపునిచ్చారు. వన్‌ ఫ్యామిలీ–వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement