అంతర వర్సిటీల క్రీడా పోటీలకు మిమ్స్ విద్యార్థులు
నెల్లిమర్ల: సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు మిమ్స్ వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రామనాథ్ రెడ్డి, హోమియో కళాశాల హౌస్ సర్జన్ శ్రీవివేక్ కుమార్ ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె. కళా వెంకట్రావు సోమవారం మీడియాకు తెలిపారు. ఈనెల 2న విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో ఈ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు చైన్నెలోని తిరుచరాపల్లి భారతిదాసన్ యూనివర్సిటీలో జరుగనున్న సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జట్టు తరఫున వీరు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ రెడ్డి, వివేక్ కుమార్‌లను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డితో పాటు మిమ్స్ చైర్మన్ అల్లూరి సత్యనారాయణ రాజు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ప్రవీణ్ వర్మ, లైఫ్ ట్రస్టీ రామకష్ణ రాజు వర్మ, కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీ కుమార్, మిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాలరావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రఘురాం, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాయక్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ నీలిమ, డాక్టర్ ప్రభాకర్ వర్మ, హోమియోపతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గణేష్ తదితరులు అభినందించారు.


