సచివాలయాల్లో వీఆర్‌ఓల చాంబర్ తప్పనిసరి
వీరఘట్టం: సచివాలయాల్లో వీఆర్‌ఓలకు చాంబర్ ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సచివాలయాలను తరచూ తనిఖీ చేపట్టాలని సూచించారు. వాటి పనితీరును మెరుగుపర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అదేవిధంగా మండంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కవిత, ఆర్‌ఐ రవితేజ, వీఆర్‌ఓలు వి.రమేష్‌నాయుడు, కోట శ్రీనివాసరావు, జి.రాజేంద్ర ప్రసాద్‌లు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు.
చెట్టు పైనుంచి పడి
గీతకార్మికుడి మృతి
డెంకాడ: మండలంలోని వెలంపేట గ్రామానికి చెందిన ఒనుము పాపయ్య(42) తాటిచెట్టు పైనుంచి పడిపోయి మరణించినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు మంగళశారం తెలిపారు. వెలంపేట గ్రామం శివారులో ఉన్న తాటిపెండిలో తాటిచెట్టు ఎక్కి పడిపోయిన పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పాపయ్యను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఒనుము తౌడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


