ఉత్సాహంగా అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగుతున్నాయి. కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న 14వ విశ్వవిద్యాలయ క్రీడాసాంస్కతిక పోటీల్లో వివిధ కళాశాలల నుంచి 530 మంది విద్యార్థులు పాల్గొనగా మంగళవారం పలు కళాశాలలకు చెందిన విద్యార్ధులకు పలు క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో తొలి దశలో బాలుర విబాగంలో వాలీబాల్ క్రీడాంశంలో గరివిడి, ప్రొద్దుటూరు కళాశాలలు విజేతగా నిలిచాయి. కేరమ్స్‌లో గన్నవరం వెటర్నరీ కళాశాల, టేబుల్ టెన్నిస్‌లో తిరుపతి, గరివిడి వెటర్నరీ కళాశాలలు విజేతలుగా నిలిచాయి. వాలీబాల్ రెండో దశలో ప్రొద్దుటూరు కళాశాల విజేతగా నిలిచింది.
అదేవిధంగా బాలికల విబాగంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడాంశాల్లో గరివిడి వెటర్నరీ కళాశాల విజయం సాధించగా బాల్ బ్యాడ్మింటన్‌లో గన్నవరం వెటర్నరీ కళాశాల, టేబుల్ టెన్నిస్‌లో తిరుపతి వెటర్నరీ కళాశాల విజయం సాధించాయి.


