యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బొబ్బిలి రూరల్: బొబ్బిలి, మక్కువ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో విలువైన చెట్లు అక్రమార్కుల వేటుకు గురవుతున్నాయి. నిత్యం జరుగుతున్న ఈ తంతును అడ్డుకునేందుకు స్థానికంగా అటవీ సిబ్బంది లేకపోవడంతో వారి ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ఇక్కడ పనిచేసిన బీట్ ఆఫీసర్ కొన్నాళ్లుగా శిక్షణ కోసం వేరొక ప్రాంతానికి వెళ్లారు. తాత్కాలికంగా వేసిన బీట్ ఆఫీసర్‌కు షికారుగంజి, బొబ్బిలి బీట్‌లను అప్పగించడంతో ఎక్కడా పూర్తిస్థాయి విధులను ఆయన నిర్వహించ లేకపోతున్నారు. దీంతో రాత్రిపగలు తేడా లేకుండా యథేచ్ఛగా అటవీ సంపద నరికి సామిల్లులకు తరలించేస్తున్నారు. రెండు రోజులుగా మక్కువ మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్లను నరికి దుంగలను ట్రాక్టర్లతో బొబ్బిలి మీదుగా రాజాం ప్రాంతంలోని సామిల్లులకు తరలిస్తున్నారు. దీనిపై ఇన్‌చార్జ్ బీట్ ఆఫీసర్ గణేష్‌ను వివరణ కోరగా.. ప్రస్తుతం తాను షికారుగంజి బీట్‌లో ఉన్నానన్నారు. రెండు బీట్‌లను చూడడం కష్టతరంగా మారుతోందని వివరించారు.
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా


