స్వశక్తితో రక్షణ పొందాలి : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ప్రతీ మహిళ తమను తాము స్వశక్తితో రక్షించుకొనేందుకు స్వచ్ఛందంగా ఆత్మరక్షణ రక్షణ కోసం మెలకువలను నేర్చుకోవాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తుఫాన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాంధీ ఫౌండేషన్ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో వివక్షకు గురవుతున్నారన్నారు. వీటిని అధిగమించడానికి మహిళలు మరింత చైతన్యవంతులై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతీ మహిళ విద్యార్థి దశ నుంచే ఆత్మరక్షణ కోసం కొన్ని మెలకువలు నేర్చుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణకు సంబంధించి మెలకువలను నేర్పించే శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకురాలిని నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఎస్పీ అంబేడ్కర్, డీఎస్డీఓ వీఎస్ రమణ, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, టి.శ్రీనివాసరావు, సీహెచ్ సూరినాయుడు, బి.లక్ష్మణరావు, ఇ.నర్సింహమూర్తి, ఎస్.శ్రీనివాస్, దుర్గాప్రసాద్, జి.రామకృష్ణ, ఆర్య, ఎన్.గోపాలనాయుడు, నాంధీ ఫౌండేషన్ పీఓ భారతి, సింధియా, నెహా, ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.


