బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం జేఎన్టీయూ జీవీలో బీటెక్ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓలిశెట్టి వెంకట ఉదయ్ తేజ(20) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి రూమ్‌మేట్స్, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌కు చెందిన తేజ రెండేళ్ల కిందట విజయనగరంలోని జేఎన్టీ యూ జీవీలో బీటెక్‌లో ట్రిపుల్‌ఈ విభాగంలో చేరాడు. ఇక్కడి వంశధార హాస్టల్ రూమ్–13లో నలుగురు స్టూడంట్స్‌తో కలిసి ఉంటున్నాడు. ప్రతిరోజూ కాలేజీ క్యాంపస్‌లో జరిగే క్లాస్‌లకు, లేబొరేటరీలకు కలిసి వెళ్తున్న సహచర విద్యార్థులతో అంతగా కలివిడిగా ఉండేవాడు కాదు. ఈ మధ్య కాలేజీ క్యాంపస్‌లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసినట్లు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి రోజులాగానే తోటి విద్యార్థులు కాలేజీలో జరుగుతున్న క్లాస్‌లకు వెళ్లినా ఉదయతేజ్ మాత్రం వెళ్లలేదు.సహచర విద్యార్థులు క్లాసులు ముగించుకుని తిరిగి రూమ్కు వచ్చి చూసేసరికి తేజ దుస్తులు ఆరేసుకునే తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించగా వెంటనే హాస్టల్ వార్డెన్‌కు.. ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ ఎస్సై అశోక్ ఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూమ్‌లో విద్యార్థి నోట్‌బుక్‌లో ఐ లవ్ యూ అని రాసి ఉండడం, ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్‌ను పోలీసులు గుర్తించారు.
చదువులో దిట్ట
ఉదయ్ తేజ జాలరి కులానికి చెందిన విద్యార్థి. తండ్రి శ్రీనివాసరావు కొడుకు అభీష్టం మేరకు తన తాహతుకు మించి ఇంజినీరింగ్‌లో చేర్పించాడు. కాలేజీలో అడుగుపెట్టిన ఉదయ్ తేజ.. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందరినీ మెప్పించేవాడు. అనునిత్యం ఫోన్ చేత పట్టుకుని ఉండే ఉదయ్ తేజ.. ఫోన్ స్టేటస్‌లో ‘ఇన్‌స్టెంట్ డెత్ ఈజ్ మోర్ మెర్సిఫుల్ దెన్ లైఫ్’ అంటూ ట్యాగ్ పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


