హైదరాబాద్ విజయం
● విజ్జి క్రికెట్ మైదానంలో అండర్–15 ఉమెన్స్ ఎలైట్ టోర్నీ
● విదర్భ జట్టుపై ఘనవిజయం
విజయనగరం: స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్ –15 ఉమెన్స్ క్రికెట్ వన్డే ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్, విదర్భ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో విదర్భ జట్టుపై, హైదరాబాద్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జుట్టు 32.4 ఓవర్లలో 111 పరుగులకు ఆలవుట్ అయింది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ శాన్వి 15 పరుగులు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షేక్ అయేషా 19, అనన్య 20 పరుగులు సాధించారు. విధర్భ బౌలర్లలో ఆర్య నందన్వార్ 6.4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు హైదరాబాద్ బౌలర్లు ధాటికి 23.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటయింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనింగ్ బ్యాటర్ ఆర్య అభయ్ పంగ్డే 39 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ, ఆమెకు సహకారం అందించేవారు లేకపోవడంతో జట్టు ఓటమి పాలయింది. మిగతా బ్యాటర్ల లో వికెట్ కీపర్ వీర ఓం (10 పరుగులు), కెప్టెన్ వృష్టి దేశ్ పాండే (10) పరుగులతో రెండంకెల స్కోరు సాధించారు. హైదరాబాద్ జట్టు బౌలర్‌లలో కెప్టెన్ శాన్వి, అనన్యలు రెండేసి వికెట్లు సాధించారు.


