డ్రాయింగ్ టీచర్‌కు అభినందనలు
పార్వతీపురం: బెలగాం గిరిజన సంక్షేమ ఆశ్ర మ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తు న్న రుగడ శ్రీనివాసరావును కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం కలెక్టర్ కార్యాలయ చాంబర్‌లో అభినందించారు. ముస్తాబు కార్యక్రమంపై వేసిన చిత్రాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లోనూ చిత్రలిపిని ప్రోత్సహించాలన్నారు. అనంతరం పెన్సిల్‌తో వేసిన కలెక్టర్, జేసీల చిత్రాలను డ్రాయింగ్ టీచర్ అందజేశారు.
కొమరాడ: ఇటీవల ఒడిశా సరిహద్దులోని నాగవళి నది ఆవలవైపు సంచరించిన గజరాజుల గుంపు శుక్రవారం జంఝావతి గట్టుదాటి లక్ష్మీపేట, కంచరపాడు గ్రామాల సమీపంలోని చీకటిలోవ కొండ వద్దకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం తలపెడుతాయోనని కంచరపాడు, పాత కంబవలస, లక్ష్మీపేట గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, స్వామినాయుడువలస, గంగారేగువలస తదితర గ్రామాల్లో కూరగాయలు, జొన్న పంటల సాగులో ఉన్నాయి. పంట ఏపుగా పెరిగే సమయంలో ఏనుగులు సంచరిస్తే నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాల ని కోరుతున్నారు.
విజయనగరం అర్బన్: నైపుణ్యాలతో కూడిన ఉన్నతవిద్య నేటి పోటీ ప్రపంచానికి అవసరమని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి అన్నారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, ఎంఆర్ అటానమస్ కళాశాల జువాలజీ విభాగం సంయుక్తంగా ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్వాంటం సెక్యూరిటీ’ అనే అంశంపై ఎంఆర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు హ్యాండ్స్ ఆన్ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, అవసరమైన ప్రాక్టికల్ అనుభవం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పొందవచ్చని తెలిపారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ రవికుమార్ మా ట్లాడుతూ భవిష్యత్తులో స్కిల్ ఇండియా రాబోతుందన్నారు. క్వాంటం టెక్నాలజీ, జీనో సీక్వెన్సింగ్ వంటి నూతన టెక్నాలజీలను విద్యార్థు లు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంత రం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాన్సాస్ కరెస్పాండెంట్ ప్రొఫె సర్ కేవీఎల్‌రాజు, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాంబశివరావు, జువాలజీ విభాగాధి పతి ఎ.గోపాల్, డాక్టర్ శివగణేష్, డాక్టర్ నాగజగ్గయ్య, ఆదిత్య మహిళా కళాశాల, ఎంఆర్‌కళాశాల, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కళాశాల, సెంచూరి యన్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 81వ వర్ధంతి కార్యక్రమాన్ని దాసు స్వగృహంలో ఆదిభట్ల ఫౌండేషన్ ఆనంద నారాయణ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించారు. దాసు విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలేసి నివాళులర్పించారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ముఖ్య అతిథిగా, స్పార్క్ సొసైటీ వ్యవస్థాపకు లు పి.భవాని పాల్గొన్నారు. హరికథ రంగానికి ఆదిభట్ల ఎనలేని సేవలందించారన్నారు.
డ్రాయింగ్ టీచర్‌కు అభినందనలు
డ్రాయింగ్ టీచర్‌కు అభినందనలు


