● పాస్ పుస్తకాల పంపిణీలో అధికారుల పక్కనే టీడీపీ శ్రేణు
● అధికారుల సమక్షంలోనే రాజకీయ విమర్శలు
కురుపాం మండలం డి.బారామణిలో నిర్వహించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమమిది. ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఐఏఎస్‌లతోపాటు.. ఒక టీడీపీ నాయకుడు కూడా వేదికను పంచుకున్నారు. ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో టీడీపీ యువజన విభాగానికి చెందిన కోలా రంజిత్‌కుమార్(ఎమ్మెల్యే జగదీశ్వరికి కుడివైపు ఉన్న వ్యక్తి) పాల్గొనడం.. అందునా ఐఏఎస్ అధికారులతో సమానంగా వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది.


