కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డికి జిల్లా అధికారులు గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని, జిల్లాను అన్ని రంగాల్లో పురోభివృద్ధికి సహకరించాలని కోరుతూ తన చాంబర్‌లో కలెక్టర్ కేక్‌ను కట్‌చేశారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, వినోద్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్ సింగ్, డీఈఓ పి.బ్రహ్మజీరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ ఎం.సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, వ్యవసాయాధికారి ఆర్.అన్నపూర్ణ, పశుసంవర్థకశాఖాధికారి ఎస్.మన్మథరావు, మత్స్యశాఖాధికారి సంతోష్, డీపీఓ కొండలరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ కొత్త సంవత్సర వేడుకలు
కొమరాడ: గిరిజనులతో కలిసి కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి కొత్తసంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొమరాడ మండలం అర్తాం పంచాయ తీ గదబవలస గ్రామంలో కేక్‌ను కట్‌చేసి గిరిజనులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులపై ఐటీడీఏ పీఓతో చర్చించి పనులు పూర్తిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చిన్నారులకు పుస్తకాలు అందజేశారు.
కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు


