
ఇంటి ముందు పుర్రె
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడికిలపేట గ్రామంలోని పి.పైడమ్మ ఇంటి ముందు కుంకుమ, పసుపు రాసిన పుర్రెను గుర్తు తెలియని దుండగులు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి పి.పైడమ్మ, కుటుంబసభ్యులు ఇంటిలో నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ముందు మనిషి పుర్రె పెట్టి, దాని చుట్టూ కుంకుమ,పసుపు చల్లి ఉండడాన్ని గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు.