
ఏనుగుల బీభత్సం
● ధ్వంసమైన పంటలు
● వాపోతున్న రైతులు
పార్వతీపురం రూరల్: Ð]l$…yýl-ÌS…ÌZ Mö°² ÆøkË$V> ç³Ë$ {´ë…™éÌZÏ H¯]l$-VýS$ÌS VýS$…ç³# OòÜÓÆý‡-ÑàÆý‡… ^ólçÜ*¢ OÆð‡™èl$ÌS iÑ™éÌS-™ø ^ðlÌS-V>rÐ]l*-yýl$-™èl$-¯é²Æ‡$$. MýS…sìæMìS Æð‡ç³µ-Ìê M>´ë-yýl$-MýS$…r$¯]l² ç³…rÌS¯]l$ VýSfÆ>kË$ ¯éÔèæ¯]l… ^ólçÜ$¢…sôæ, AÇMýS-rtyýl…-ÌZ MýS*rÑ$ {糿¶æ$-™èlÓ… òœ*Æý‡…-V> ÑçœÌS-OÐðl$…-§ýl° OÆð‡™èl$-Ë$, Ý린MýS$-Ë$ ¡{Ð]l B{VýS-çßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. ™égêV> Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÐólMýS$-Ð]l-gêÐ]l¬ ¯]l$…_ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$…yýl-ÌS…ÌZ° Æ>ÑMø¯]l ç³…^éĶæ$¡ AyŠæ-{yýl*-ిÐ]l-ÌSçÜ, íßæ…§ýl*-ç³#Æý‡… {V>Ð]l*-ÌS-ÌZ H¯]l$-VýS$ÌS VýS$…ç³# ç³…rÌS¯]l$ «§ýlÓ…çÜ… ^ólçÜ*¢ ½¿ýæ-™èlÞ… çÜ–íÙt…^鯇$$.
రెండు గ్రామాల్లో అపార నష్టం
అడ్డూరివలస గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే రైతు కష్టమంతా ఏనుగుల పాలైంది. ఏపుగా పెరిగి పూత దశకు కొద్ది రోజుల్లో వచ్చే దాదాపు 200 కొబ్బరి మొక్కలను గజరాజుల గుంపు నేలమట్టం చేసింది. కాయకొచ్చిన కోకో తోటలను సైతం వదలకుండా నాశనం చేశాయి. సేకరించి ఉంచిన కోకో కాయలను ధ్వంసం చేసి తినేశాయి. అంతటితో ఆగకుండా, పొలంలోని మోటార్‌ను ధ్వంసం చేశాయి. అలాగే, మండలంలోని హిందూపురం గ్రామంలో గుణ అనే రైతుకు చెందిన కొబ్బరి మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏనుగుల గుంపు సంచరిస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిద్ర వీడాలి
ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని రైతులు, స్థానికులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, ఏనుగుల దాడులను అరికట్టేందుకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కేవలం హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిష్కార చర్యలూ తీసుకోవడం లేదని ఆరో పిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులను ఈ విధంగా నష్టపెట్టకుండా, తమ పంటలను ప్రాణాలను గజరాజుల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు.
లోవగూడలో ఏనుగులు
భామిని: మండలంలోని లోవగూడ సమీపంలోకి మంగళవారం ఏనుగుల గుంపు చేరుకుంది. మొక్కజొన్న, వరి పంటలను తినివేస్తూ పాడు చేస్తున్నాయని గిరిజన రైతులు వాపోతున్నారు. ఏనుగులు సమీపంలోని మెట్టపై మకాం వేసినట్లు ఫారెస్ట్ అదికారులు తెలిపారు.

ఏనుగుల బీభత్సం

ఏనుగుల బీభత్సం

ఏనుగుల బీభత్సం

ఏనుగుల బీభత్సం