
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సంతకవిటి: మండలంలోని సిరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం వి.వెంకటరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన క్రీడల్లో పరుగుపందెలో అండర్ 19 విభాగంలో కె.దిలీప్‌కుమార్, జి.సంతోష్, ఎం.అరుణ్‌కుమార్, జి.జ్యోత్స్న, పి.కుసుమ, ఎస్.కల్పన, ఎ.జాన్సీలు, ఖో–ఖో క్రీడలో పి.లిఖిత్, అండర్ 17 బేస్‌బాల్ విభాగంలో కె.రాజేంద్ర మంచి ప్రతిభ చూపించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వారిని మంగళవారం పాఠశాలలో హెచ్ ఆధ్వర్యంలో మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీడీ కె.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.