
పోటెత్తిన భక్తులు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందిన శ్రీపైడితల్లి దర్శనానికి భక్తులు మంగళవారం పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని అమ్మవారి ఆలయానికి పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తజనం క్యూలైన్‌లలో ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వేచి ఉండి దైవదర్శనం చేసుకున్నారు. అయితే భక్తులు వేచి ఉన్న చోట ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా తమ ఫోన్‌పేలకు డబ్బు లు పంపించుకుని టికెట్లు ఇవ్వకుండా దర్శనానికి పంపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.