
రహదారుల కోసం సర్వే చేశాం..
పార్వతీపురం రూరల్: జిల్లాలోని 142 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేలా సమగ్ర సర్వే చేసి అంచనాలు తయారు చేశామని జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి వీఎస్ నగేష్‌బాబు గురువారం తెలిపారు. అంచనాల ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పించామని, అవి ఆమోదం పొందిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 9న సాక్షి దినపత్రికలో గిరిసీమకు దారేది శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని రహదారులు లేని గ్రామాలకు కనీ సం అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు వేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు అంచ నాలు తయారు చేశామన్నారు. కలెక్టర్ ఆమోదం పొందిన తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు.