
చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు
కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్ భవన్ మందిర్ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయష్మాన్ భవన్ కార్యాలయంలో గల కంప్యూటర్ల పరికరాలైన సీపీయూ, కీబోర్డులు చోరీకి గురైనట్లు సంబంధిత సిబ్బంది బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా గుమ్మ గ్రామ సమీపంలో చిట్టిగెడ్డ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న బర్లి చందు, సింగమహంతి అవినాష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. చోరీ చేసిన కంప్యూటర్ పరికరాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. దర్యాప్తులో ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ శేఖర్‌మధు పాల్గొన్నట్లు చెప్పారు.