
గోడకూలి మహిళ..
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు
బొబ్బిలి: పట్టణంలోని గొల్లవీధి జంక్షన్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఎరుకల వీధికి చెందిన తోనంగి అప్పయ్యమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందగా కూలీలు రామలక్ష్మి, పొందూరు లక్ష్మణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్సై రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్న వారు ముగ్గురు ఎప్పటిలాగానే లక్కోజు శ్రీనివాసరావు ఇంటి పనులు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటుకల గోడ నానిపోయి పనిచేస్తున్న వారిపై పడగా అప్పయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామలక్ష్మి, లక్ష్మణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు, అప్పయ్యమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.అప్పయ్యమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.