
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో విజేతలుగా నిలవాలి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 10 నుంచి 12 వరకు పశ్చిమగోదావరి జిల్లా రాజమండ్రిలో అండర్ 14,17 బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు, ఈ నెల 10 నుంచి 12 వరకు బాపట్ల జిల్లా రేపల్లెలో జరగబోయే అండర్ 14 తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. వారికి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వర్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో విజేతలుగా నిలవాలి