
రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్ల సత్తా
● సాఫ్ట్‌బాల్‌లో బాలురు, బాలికలకు
ప్రథమస్థానం
తెర్లాం: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు సత్తా చాటాయి. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అండర్–14 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు విశాఖపట్నం జిల్లా గొలుగుగొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 4 నుంచి జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు పాల్గొని మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరచిన జిల్లా జట్లు ఫైనల్ పోటీలకు చేరాయి. ఫైనల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు జట్టు గుంటూరు జిల్లా జట్టుతో పోటీపడి విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే జిల్లాకు చెందిన బాలికల జట్టు చిత్తూరు జిల్లా జట్టుతో ఫైనల్ పోటీలో తలపడింది. ఈ పోటీల్లో విజయనగరం బాలికల జట్టు విజయం సాధించి ప్రథమస్థానాన్ని సొంతం చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు జట్లు అత్యుత్తమ ఆటతీరును కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్‌తోపాటు షీల్డ్‌లను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుజట్ల క్రీడాకారులను జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, కోచ్‌లు అభినందించారు. రానున్న మరిన్ని పోటీల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్ల సత్తా