
వీఎల్‌ఎస్‌ఐ కిట్‌ల విరాళం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి, సింథటిక్ ప్రొఫెసర్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న డ్రీమ్ చివ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నాలుగు వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ కిట్లు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా డ్రీమ్ చిప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు గోపీకుమార్ బుధవారం మాట్లాడుతూ ఈ కిట్‌లు ఎఫ్‌పీజీఏ ఆధారిత చిప్ డిజైన్, పరిశీలన కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక మద్దతుతో రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఎంబెడెడ్ ఏఐ చిప్ డిజైన్, కన్జూమర్ టెక్నాలజీ చిప్ డిజైన్ ఇండస్ట్రీయల్ కంట్రోల్ చిప్ డిజైన్, డ్రోన్ చిప్ డిజైన్, మెడికల్ టెక్ చిప్ డిజైన్, అటోమోటివ్ చిప్ డిజైన్, ఫిన్‌టెక్ చిప్ డిజైన్ వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ కిట్‌లకు డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ సంస్థ నుంచి ఈ మెయిల్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ కిట్లు తమిళనాడులోని చైన్నెలో రూపొందించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆంధ్ర మెడ్ టెక్ జోన్‌లో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తయారుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు మురళి, జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ బబులు, ఈసీ విభాగాఽధిపతి ప్రొఫెసర్ కేసీబీ రావు, ఇతర బోధకులు పాల్గొన్నారు.