
గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామానికి సమీపంలో గల పెట్రోల్ బంకు దరి బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తున్న బైక్‌ను విజయనగరం నుంచి జక్కువ వెళ్తున్న అర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తి తనది ఎస్.కోట అని చెప్పి కోమాలోకి వెళ్లిపోవడంతో తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేష్ తెలియజేశారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
కారు ఢీకొని మరో వ్యక్తికి..
బొండపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. . పార్వతీపురం నుంచి బొండపల్లి మండలంలోని బి.రాజేరు గ్రామానికి పైల ఈశ్వర్రావు తన బైక్‌పై భార్య, ఇద్దరు కుమార్తెలతో వస్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వస్తున్న కారు ఢీకొనడంతో బైక్ నడుపుత్నున ఈశ్వరరావుకు గాయాలయ్యాయి. గాయపడిన ఈశ్వర్రావును గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.