
● ఆ పార్టీ కార్యకర్తల కోసమేనా..
పండగ మొత్తం తెలుగుదేశం కార్యకర్తల కోసమే చేసినట్టుగా ప్రజల భావించాల్సిన పరిస్థితి నెలకొంది. వీధి, వార్డు స్థాయి కార్యకర్త కూడా రాష్ట్ర స్థాయి ప్రొటోకాల్ ఉన్నట్లుగా భావిస్తూ రొమ్ము విరుచుకుంటూ గుడి పరిసరాల్లో తిరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకొని పోలీసులు సాధారణ భక్తులను మాత్రం ఈడ్చి పారేశారు. అదేమిటో... దేవుళ్లు కూడా పెద్దలు.. డబ్బున్నవాళ్లనే కరుణిస్తాడు.. తప్ప పేదలను కనీసం కనికరించరు. దీంతో చాలా మంది భక్తులు బయట నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మా ఈ ఒక్క దండాన్ని కోటి దండాలుగా భావించుకో అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు.