
సమాజానికి వాల్మీకి ఆలోచనలు ఆదర్శనీయం
●ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: ఆదికవి, మహర్షి వాల్మీకి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్, పోలీస్ కార్యాలయాల్లో మంగళవారం వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి బోధించిన సత్యం, ధర్మం, మానవతా విలువలను ప్రతీఒక్కరు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన ధర్మ పఽథం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరావు, ఆర్‌ఐలు రాంబాబు, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సమాజానికి వాల్మీకి ఆలోచనలు ఆదర్శనీయం