
పచ్చకామెర్లతో గిరిజన యువకుడు మృతి
● ఆలస్యంగా వెలుగులోకి..
గుమ్మలక్ష్మీపురం: పచ్చకామెర్ల వ్యాధితో కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు పువ్వల అంజలి, తోయక కల్పన మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పచ్చకామెర్లతో బాధపడుతూ విశాఖపట్నంలోని కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని బాలేసు గ్రామానికి చెందిన గిరిజన యువకుడు నిమ్మక సుమన్ (21) పచ్చకామెర్ల వ్యాధితో పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ వరకూ చదువుకున్న సుమన్ ప్రయోజకుడై తమను పోషిస్తాడని ఆశించిన తల్లిదండ్రులు సుమన్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.