స్పష్టం చేసిన ఇరిడి మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు
ఎంఈఓ చొరవతో రైతు సేవా కేంద్రంలో తరగతుల నిర్వహణ
గత ప్రభుత్వం నాడు–నేడు రెండో
విడతలో నిధులు మంజూరు
రూ.9 లక్షలతో పిల్లర్ల స్థాయి వరకు పనులు
కూటమి వచ్చాక నిలిచిపోయిన నిర్మాణం
గుమ్మలక్ష్మీపురం:
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తమ గ్రామంలో పాఠశాలకు భవనం నిర్మిస్తేనే పిల్లలను బడికి పంపుతామని గుమ్మలక్ష్మీపురం మండలంలో ని ఇరిడి గ్రామానికి చెందిన ఎంపీపీ స్కూల్ (ప్రస్తు తం మోడల్ ప్రైమరీ స్కూల్) విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. భవన నిర్మాణంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ పాఠశాల వద్ద సోమవారం ఆందోళన చేశారు. వర్షాలకు విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. గాలివీస్తే ఎగిరిపోయే రేకుల షెడ్ లో పిల్లలు ఎలా అభ్యసించగలరని ప్రశ్నించారు. విద్యా ర్థుల ఆందోళన విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న ఎంఈఓ బి.చంద్రశేఖర్ పాఠశాల వద్దకు వచ్చారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో తరగతులు నిర్వహిస్తామని, పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులను ఒప్పించారు. ఈ సందర్భంగా స్కూల్ కమిటీ చైర్మన్ దినేష్, తదితరులు మాట్లాడుతూ.. గ్రామంలోని పాఠశాల భవనం పూర్తిగా శిఽథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు రెండోఫేజ్‌లో నూతన భవనం నిర్మించేందుకు రూ.51లక్షలు మంజూరు చేసిందన్నారు. రూ.9లక్షల విలువైన పనులు జరిగా యన్నారు. అప్పట్లో ప్రత్యామ్నాయంగా పాఠశాల ఆవరణలో రేకుల షెడ్డును తామంతా నిర్మించామ న్నారు. ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విరిగిపడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని బడికి పంపితే ఏ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని భయాందోళనకు గురవుతున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాధికారులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల భవ నం పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చి మిన్నకున్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తీరును విద్యార్థుల తల్లిదండ్రులు దుయ్యబడుతున్నారు.
56 మంది విద్యార్థులు
ఇరిడి గ్రామంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక హెచ్‌ఎం, ము గ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. తరగతి గదులు లేకపోవడంతో బోధించేందుకు ఉపాధ్యాయులు, అభ్యసించేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
భవనం నిర్మిస్తేనే... బడికి పంపిస్తాం