
సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పుష్ప ప్రదర్శన
న్యూస్‌రీల్
విజయనగరం ఫోర్ట్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుష్పాలను ఆసక్తిగా తిలకించారు. పలు రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా పుష్పాలతో ఏర్పాటు చేసిన తంబుర, వయోలిన్, గంటస్థంభం, సీతాకోక చిలుక, కూరగాయలతో తయారు చేసిన మొసలి, డ్రాగన్, సైకత పైడితల్లి ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.చిట్టిబాబు, డీఆర్‌డీఏ పి.డి. శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తగ్గుముఖం పట్టిన ‘తోటపల్లి’ ఉధృతి
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నాగావళి నీటి ప్రవాహం ఉధృతంగా వచ్చి క్రమేపి తగ్గుముఖం పడుతుంది. దీంతో నాగావళి నది పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం నాటికి 105 మీటర్ల లెవెల్‌కుగాను 103.6 మీటర్ల లెవెల్‌లో నీరు నిల్వ వుంది. ప్రస్తుతం నది పైభాగం నుంచి ప్రాజెక్టుకు 5,769 క్యూసెక్కుల నీరు రాగా ఈ మేరకు అధికారులు రెండు గేట్లును ఎత్తివేసి 4,525వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచి పెడుతున్నారు. అలాగే కాలువల ద్వారా 1,070 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.53 టీఎంసీలకుగాను 1.692 టీఎంసీల నీటి సామర్థ్యం వున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ ఏఈ కిషోర్ పర్యవేక్షిస్తున్నారు.
వైభవంగా స్వామివారికి శ్రీచక్ర స్నానం
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు సందర్భంగా ఆదివారం స్వామివారికి శ్రీచక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, చూర్ణోత్సవం, స్వపనం, మంగళాశాసనం, శాత్తుమురై తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఆశీనులు చేయించి మంగళ వాయిద్యాలతో జలాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను, విశేష అర్చనలను నిర్వహించి స్వామివారికి శ్రీ చక్ర స్నానాన్ని అర్చకులు వీవీ అప్పలాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పవిత్ర నాగావళి నదిలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. స్వామివారి శ్రీచక్ర స్నానం వేడుకలలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఖాజీపురంలో గజరాజులు
భామిని: మండలంలోని గజపతినగరం సమీపంలో ఖాజీపురానికి గజరాజుల గుంపు ఆదివారం చేరుకుంది. ఏబీ రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన కాలనీ ఖాజీపురానికి నాలుగు ఏనుగులు చేరడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే గిరిజనులు పండించే పంటలను ఏనుగులు తినివేయడంతో పాటు ధ్వంసం చేస్తుండడంతో తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయనగరం ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఉత్సవాల్లో భాగంగా 11 వేదికల్లో వివిధ రకాల కార్యక్రమాల ను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఆదివారం అతిథులు చేతుల మీదుగా ప్రా రంభించారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోగా... మాన్సాస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలు చూపరులకు కనువిందు చేశాయి. బొంకుల దిబ్బపై పౌరాణిక నాటకాలు ప్రదర్శించగా, గురజాడ కళా క్షేత్రంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అలరించాయి. లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో జానపద కళా రూపా లు ప్రదర్శన విజయనగరం సంస్కృతిని ప్రతిబింబించగా.. అయోధ్య మైదానంలో నిర్వహించిన పెట్ షో అందరినీ ఆకట్టుకుంది. రెండవ రోజైన సోమవారం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ అయోధ్య మైదానంలో ప్రముఖ సింగర్స్‌తో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగారురాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జేసీ ఎస్.సేతుమాధవన్ తదితర ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూ పాలతో మైమరిపింపజేస్తూ, విచిత్ర వేషధారణల తో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయా త్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆసీనులై కళా రూపాలను తిలకించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి గజపతిరాజు కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు.
శోభాయమానంగా శోభాయాత్ర
ర్యాలీలో స్వాగత శకటం, రోలర్ స్కేటర్స్ విన్యాసాలతో, పైడితల్లి అమ్మవారి కలశాలతో మహిళలు,
కోటలో చిన్నారుల నృత్య రూపకం
తప్పెటగుళ్లు, థింసా నృత్యం, పులి వేషాలు, విచిత్ర వేషాలు, ఆగమ పండితుల బృందం, విజయనగ రం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్ర సాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డ్యాన్స్, బిందెల డ్యా న్స్, చెక్క భజన, గంగిరెద్దులు, జముకుల బృందం, కాళీమాత డ్యాన్స్, ఎన్సీసీ కేడేట్స్ మార్చ్, కోలాటం, క్రీడా సంఘాలు మరియు క్రీడాకారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఎస్.హెచ్.జి.గ్రూపులు తదితర బృందాలు అలరించాయి.
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపా టి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరా వు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాల ను కాపాడుకొనేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయనున్నారు. నేటి తరానికి సంప్రదాయాలు, కళలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలను, కళాకారులను ఆదుకునేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో అవసరమ ని అన్నారు. పైడితల్లి అమ్మవారు జిల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
11 వేదికల్లో ఆకట్టుకున్న వివిద కార్యక్రమాలు
విజయనగరం టౌన్: శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి (ఏరు)తో తొలుత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్ల ని పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలు, దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళతారు. అక్కడ కోటశక్తికి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతులతో ఆ విత్తనాలను అందించి అమ్మవారు ఆశీర్వదిస్తారు. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు. మంచి దిగుబడులు సాధిస్తారు.
విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరి అమ్మవారి తొలేళ్ల సంబరాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం నుంచి మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకూ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడువేల మంది పోలీసు బలగాలను ఉత్సవ విధులకు కేటాయిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి, మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరారుతోంది. మరోవైపు విజయనగర ఉత్సవాల సందడితో చారిత్రాత్మక కట్టడాలన్నీ విద్యుత్ అలంకరణలతో శోభాయామానంగా తయారైంది. మహారా జ కోట, గంటస్తంభం, మహారాజా ప్రభుత్వ సంగీ త, నృత్య కళాశాల, మయూరీ కూడలి నుంచి రైల్వేస్టేషన్ మీదుగా సీఎంఆర్ జంక్షన్ వరకూ విద్యుత్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారు ఆలయమంతా పుష్పశోభితంగా విరాజిల్లుతోంది. తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజ లు, అధికారులు సన్నద్ధమయ్యారు.
●వేకువజామున 3 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు.
●ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
●రాత్రి 10.30 గంటలకు భాజాభజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలో కి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహిస్తారు.
●ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై భక్తుల సౌకర్యార్ధం ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లిస్తారు.
●ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు.
ప్రత్యేక అలంకరణలో పైడితల్లి అమ్మవారు

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025