
డ్వాక్రా బజారులో 19 రాష్ట్రాల సంఘాలు
విజయనగరం టౌన్: అఖిల భారత డ్వాక్రా బజార్‌లో ఏపీతో పాటు 19 రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు పాల్గొనడం అభినందనీయమని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సరస్‌ను ఆయన సందర్శించి, మహిళా సంఘాలతో స్టాల్స్‌లో సేల్, ఏర్పాట్లు తదితర వాటిపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదురోజుల నుంచి నిర్వహిస్తున్న డ్వాక్రా బజారు, సరస్‌కు గతేడాది కంటే ఈ ఏడాది విశేషమైన స్పందన లభించిందన్నారు. గతేడాది రూ.8 కోట్ల అమ్మకాలు జరిగాయని, ఈ ఏడాది రూ. 12 కోట్ల వరకూ జరిగే అవకాశం ఉందన్నారు. పైడితల్లి అమ్మవారి పండగ వేళ వస్త్రాలు, గృహోపకరణాలకు షాపులు చుట్టూ తిరగాల్సి న పనిలేకుండా ఆకట్టుకునే కలంకారీ కాటన్ వస్త్రాలు, కొయ్యబొమ్మలు, జూట్, వెదురు ఉత్పత్తులు ఒకేచోట లభ్యమవుతున్నాయన్నారు. విజయనగర ఉత్సవాల్లో భాగంగా ఉద్యానవనశాఖ సమన్వయంతో ఫ్లవర్‌షోను ఇక్కడే ప్రత్యేక ఆకర్షణతో ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలలోని పలు జాతుల పుష్పాలను తీసుకువస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.